నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు విడదల రజని
నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు మాజీ మంత్రి విడదల రజిని హాజరుకానున్నారు
నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు మాజీ మంత్రి విడదల రజిని హాజరుకానున్నారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో విచారణ చేయనున్నారు. ఈ మేరకు విడదల రజనీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై విడదల రజనీపై కేసు నమోదయింది.
రెంటపాళ్ల పర్యటనలో...
అయితే ఈ కేసులో విచారించడానికి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో విడదల రజని నేడు విచారణకు హాజరు కకానున్నారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో పోలీసులను అడ్డుకోవడమే కాకుండా ప్రమాదానికి గురై సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై కూడా పోలీసులు విచారణ జరపనున్నారు.