Andhra Prdesh : సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి చెందారు. ఆయన మృతి పట్ల నేతలు సంతాపాన్ని ప్రకటించారు
satyanarayana passed away
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు.
నాలుగు సార్లు గెలిచి...
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి నాలుగుసార్లు వరుసగా గెలుపొందారు. అనంతరం మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.