Perni Nani : పేర్ని నాని హౌస్ అరెస్ట్
మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు
mlc election in AP
మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పేర్నినానిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
గన్నవరంలోనూ భారీ బందోబస్తు...
ఇటు గన్నవరంలోనూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా గన్నవరంలో పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు. డీఎస్పీ నేతృత్వంలో టీడీపీ నేతలను బయటకు రాకుండా చూస్తున్నారు. వైసీపీ నేతలు ఎవరూ బయటకు రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లు జరుగతాయన్న సమాచారంతోనే ఈ చర్యలకు పోలీసులు దిగారు.