Perni Nani : కలుగు నాయుడు అప్పుడే బయటకు వస్తాడు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో కంటే ఇప్పుడు మద్యం అమ్మకాలు తగ్గాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీ నాయకులకు శిక్షణ ఇచ్చి కల్తీ మద్యాన్ని అమ్ముతుండటం వల్లనే మద్యం అమ్మకాలు తగ్గాయని తెలిపారు. టీడీపీ నేతలు సొంతంగా మద్యం తయారీ చేస్తున్నారు. బూమ్ బూమ్, సూపర్ సిక్స్ మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.
చంద్రబాబు కు డ్యామేజీ జరిగితేనే...
అయితే ఈ విషయంలో ఇంత జరుగుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ మాత్రం స్పందించరన్నారు. కలుగు నాయుడు మాత్రం కలుగు లోనుంచి బయటకు రారని అన్నారు. మహిళలపై అత్యాచారం జరుగుతున్నా బయటకు రారని, కల్తీ మద్యం తయారు చేస్తున్నా దానిపై స్పందించరని, చంద్రబాబుకు డ్యామేజీ జరుగుతుందని భావిస్తే వెంటనే కలుగు నాయుడు కలుగులో నుంచిబయటకు వచ్చి జగన్ పై విమర్శలు చేసి, చంద్రబాబుకు అండగా నిలుస్తారని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.