పవన్ కు అంత సీన్ లేదన్న పేర్ని

మాజీ మంత్రి పేర్నినాని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-07-05 12:24 GMT

మాజీ మంత్రి పేర్నినాని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎర్రబుక్కు పేరుతో వెర్రిపాలన జరుగుతోంది మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. మల్లేశ్వరరావుపై టీడీపీ నేతల హత్యయత్నం దుర్మార్గమని అన్నారు. అక్రమాలను అడ్డుకుంటున్నాడనే హత్యాయత్నం చేశారని తెలిపారు. ఏడాదిగా ప్రతిరోజూ రాజకీయ దాడులు జరుగుతున్నాయన్న మాజీ మంత్రి పేర్ని నాని పోస్టర్లను తప్పుపట్టేవారికి దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

2019లో కూడా ఇంతే...
షూటింగ్‌లో ఉండే పవన్‌ కల్యాణ్‌ చిక్కడు.. దొరకడు అన్నట్లుగా ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో పవన్‌ స్పీచ్‌లన్నీ సినిమా డైలాగులేనని, జగన్‌ను అధికారంలోకి రానివ్వనని అనడానికి పవన్‌ ఎవరు అని పేర్ని నాని నిలదీశారు. 2019లో కూడా జగన్‌ను రానివ్వను అని పవన్‌ అనలేదా? అని నాని గుర్తు చేశారు. తన శాఖలో ఏం జరుగుతోందో పవన్‌కు తెలుసా అని పేర్ని నాని ప్రశ్నించారు.


Tags:    

Similar News