మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు

Update: 2025-08-20 05:26 GMT

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. గత 86 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైలులో కాకాణి గోవర్థన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై దాదాపు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ ఎనిమిది కేసుల్లో ఆయనకు ఒక్కొక్కటిగా బెయిల్ లభిస్తూ వచ్చింది.

గూడూరులోనే ...
గత కొన్ని రోజులుగా అక్రమ మైనింగ్ కేసుతో పాటు ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం సరఫరా చేశారంటూ పలు కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు ఆయన నెల్లూరులో ఉండేందుకు వీలులేదు. ఆయన గూడూరులో ఉండనున్నారు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయించాల్సి ఉంటుంది.


Tags:    

Similar News