కాకాణి రేపు విడుదలయ్యే ఛాన్స్
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ లభించింది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ లభించింది. గత డెబ్భయి ఐదు రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకాణి గోవర్థన్ రెడ్డిని అనేక కేసులో వరసగా అరెస్ట్ చేశారు.
పాస్ పోర్టును కోర్టుకు...
అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన కాకాణి గోవర్థన్ రెడ్డిపై తర్వాత అక్రమ మైనింగ్ తో పాటు ఎన్నికల్లో మద్యం పంపిణీ చేశారన్న కేసు కూడా నమోదయింది. దీంతో దాదాపు ఎనిమిది కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని, కాకాణి పాస్‌పోర్ట్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.