నేడు పోలీసుల ఎదుటకు అనిల్ కుమార్ యాదవ్

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేడు పోలీసు విచారణకు హాజరు కానున్నారు

Update: 2025-07-26 02:51 GMT

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేడు పోలీసు విచారణకు హాజరు కానున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు విచారణకు రావాలని అనిల్ కుమార్ యాదవ్ కు కోవూరు పోలీసులు నోటీససులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై...
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని నిన్న ప్రశ్నించిన పోలీసులు నేడు అనిల్ కుమార్ యాదవ్ ను విచారించనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు కోవూరు సర్కిల్ కార్యాలయానికి రావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ఆయన వస్తారా? రారా? అన్నది మరికాసేపట్లో తేలనుంది.


Tags:    

Similar News