నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ అంబటి
నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు రానున్నారు
నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు రానున్నారు. సత్తెనపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదయింది. దీంతో అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుతో పాటు విడదల రజని, లేళ్ల అప్పిరెడ్డి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
విడదల రజని, అప్పిరెడ్డిలు...
ఈరోజు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు అంబటి రాంబాబుతో పాటు విడదల రజిని, అప్పిరెడ్డి కూడా హాజరుకానున్నారు. వీరిని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వైసీపీ నేతల రాక సందర్భంగా సత్తెన పల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వారిని మినహాయించి మరెవ్వరికీ అనుమతి లేదని పోలీసులు తెలిపారు.