Ambati Rambabu : పవన్ వెళ్లాల్సింది అక్కడకు కాదన్న అంబటి
మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి పవన్ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు
ambati rambabu
మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి పవన్ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వెళ్లాల్సింది సరస్వతీ భూముల పరిశీలనకు కాదని అంబటి రాంబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల బలయిపోయిన ఆడబిడ్డల కుటుంబాలను పరామర్శించడానికి పవన్ కల్యాణ్ వెళితే బాగుంటుందని అంబటి రాంబాబు పవన్ కు తెలిపారు.
శాంతిభద్రతలను...
సరస్వతీ భూములను పరిశీలించిన మాత్రాన ఏమీ జరగదన్న అంబటి రాంబాబు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఆడబిడ్డలు రోజుకొకరు ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారానికి గురవుతున్నారని తెలిపారు. వాటిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, విపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు దిగడం పాలన అనిపించుకోదని అంబటి హితవు పలికారు.