అన్ని కేసుల్లో బెయిల్.. బయటకు రాగానే?

మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ కు అన్ని కేసుల్లో బెయిల్ లభించింది

Update: 2025-07-30 07:28 GMT

మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ కు అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. గుంటూరు జిల్లా జైలు నుండి విడుదలైన కిషోర్ ను మరొక కేసులో తుర వెంటనే రెంటచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషోర్ ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీస్ వాహనం ఎదుట తురకా కిషోర్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

మరో కేసులో...
తురకా కిషోర్ ను అరెస్ట్ చేయకుండా పోలీస్ వాహనాన్ని అడ్డుకొని కిషోర్ సతీమణి ఆందోళన చేయడంతో ఆమెను తొలగించి కిషోర్ ను తీసుకెళ్లారు. తురకా కిషోర్ ను పోలీసులు రెంటచింతల పిఎస్ కు తరలిస్తున్నారు. కిషోర్ పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల వచ్చిన టిడిపి నేతల వాహనంపై దాడి చేసిన కిషోర్ పై వరస కేసులు నమోదవుతుండటంతో గత కొద్ది నెలల నుంచి జైలులోనే ఉన్నారు.


Tags:    

Similar News