ఏబీకి ఏపీలో కీలక పదవి
మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది.
మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఏబీ వెంకటేశ్వరరావును పోలీసు గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ గా పరభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఏబీ వెంకటేశ్వరరావు ఆ పదవిలో కొనసాగనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల ఆయనకు రావాల్సిన బకాయీలను చెల్లించిన ప్రభుత్వం తాజాగా నామినేటెడ్ పోస్టును అప్పగించింది.
వివిధ హోదాల్లో పనిచేసిన...
ఏబీ వెంకటేశ్వరరావు 2014 లో టీడీపీ గెలిచిన తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రధానంగా ఇంటలిజెన్స్ అధికారిగా పనిచేశారు. 1989 బ్యాచ్ కు చెందిన ఏబీ వెంకటేశ్వరరావు గత ఏడాది మే 31వ తేదీన పదవీ విరమణ చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా కూడా ఆయన విధులు నిర్వహించారు. ఏసీబీ డీజీ వంటి కీలక పోస్టుల్లో కూడా పనిచేశారు.