Vallabhaneni Vamsi : నేడు చివరి రోజు కస్టడీకి వల్లభనేని వంశీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీకి నేడు చివరి రోజుకు చేరుకుంది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీకి నేడు చివరి రోజుకు చేరుకుంది. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసు, సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసుల విషయంలో వల్లభనేనివంశీని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు.
ఆఖరి రోజు కావడంతో...
నేడు మూడో రోజు ఆఖరి దినం కావడంతో ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారణ చేయనున్నారు. వంశీతో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను కూడా ఈ స్టేషన్ లోనే విచారిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు వైద్య పరీక్షలు అనంతరం జిల్లా జైలుకు వంశీని తరలించనున్నారు.