Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారన్న ఆరోపణలపై వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన తనకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
తనపై నమోదయిన కేసులు...
తనపై నమోదయిన కేసులు తప్పడువని, రాజకీయ ప్రేరేపితమైనవని చెబుతూ పిటీషన్ వేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. మరోవైపు వల్లభనేని వంశీని తమకు కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు వేసిన పిటీషన్ పై కూడా విచారణ జరగనుంది.