వైఎస్ జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ అధినేత జగన్ ను కలిశారు.

Update: 2025-07-03 07:36 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లి ఆయన నివాసానికి వచ్చిన వల్లభనేని వంశీని జగన్ సాదరంగా ఆహ్వానించారు. వల్లభనేని వంశీ దాదాపు 137 రోజుల పాటు విజయవాడు జిల్లా జైలులోనే ఉన్నారు. దాదాపు పదకొండు కేసులు నమోదు కావడంతో ఆయన నాలుగు నెలలకు పైగానే జైలు జీవితం గడిపారు.

బెయిల్ రావడంతో...
అయితే పదకొండు కేసుల్లో బెయిల్ రావడంతో నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న జైలు నుంచి విడుదలయిన వల్లభనేని వంశీ నేడు జగన్ ను కలిసి చర్చలు జరపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. త్వరలోనే గన్నవరం రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని నిన్న పేర్ని నాని ప్రకటించడడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది


Tags:    

Similar News