గన్నవరం వంశీ జైలు నుంచి విడుదల
విజయవాడ జిల్లా జైలు నుంచి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదల అయ్యారు.
విజయవాడ జిల్లా జైలు నుంచి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదల అయ్యారు. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. వల్లభనేని వంశీపై పదకొండు కేసులు నమోదు కావడంతో గత 137 రోజుల నుంచి విజయవాడ జిల్లా జైలులోనే ఉన్నారు. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్, మరికొన్నికేసుల్లో షరతులతో కూడిన బెయిల్ లభించింది.
తిరిగి రాజకీయాల్లోకి...
విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయిన వల్లభనేని వంశీకి పేర్ని నానితో పాటు వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ వంశీపై తప్పుడు కేసులు పెట్టారని, చట్టంలోని లొసుగులు అడ్డుపెట్టుకుని కేసులు పెట్టారని అన్నారు. సుప్రీంలో కూడా బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ వేశారకని, అనారోగ్యంతో ఉన్నా కూడా వదిలిపెట్టలేదన్నారు పేర్నినాని. వంశీ ఇప్పుడు కాకపోయినా 4 ఏళ్ల తర్వాత అయినా.. గన్నవరం నుంచి రాజకీయాలు మొదలుపెడతారని పేర్నినాని తెలిపారు.