Breaking : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యేను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడకు వంశీని తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో...
గన్నవరం టీడీపీ కార్యాలయం కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి గన్నవరానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఇదే కేసులో అనేక మంది అరెస్ట్ అయిన నేపథ్యంలో వల్లభనేని వంశీ అరెస్ట్ తో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీసులు గన్నవరంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు.