Vallabhaneni Vamsi : సుప్రీంకోర్టులోనూ వంశీకి ఊరట
సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది
సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమయింది. గన్నవరం ప్రైవేట్ స్థలవివాదం కేసులో సీతామహాలక్ష్మి అనే మహళ హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. వంశఈ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ లో పేర్కొంది.
బెయిల్ రద్దుకు...
అయితే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయడానికి నిరాకరించింది. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరించింది. ఇప్పటికే వల్లభనేని వంశీపై నమోదయిన పదకొండు కేసుల్లో బెయిల్ లబించడంతో మరికాసేపట్లో విడుదల కానున్నారు.