YSRCP : జగన్ ను వదిలేది లేదు.. వైసీపీలోనే ఉంటా

తాను వైసీపీ పార్టీని వీడేది లేదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు.

Update: 2025-06-07 04:18 GMT

తాను వైసీపీ పార్టీని వీడేది లేదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను జగన్ వెంటే నడుస్తానని తెలిపారు. తాను వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో వదలి పెట్టనని, అదే సమయంలో దెందులూరు నియోజకవర్గాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదని అబ్బయ్య చౌదరి తెలిపారు. తనపై కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవాలు లేవని ఆయన అన్నారు.

దెందులూరులోనే కొనసాగుతా...
తాను రాజకీయంగా వైసీపీ నుంచి కాలు మోపానని, జగన్ వెంట మాత్రమే నడుస్తానని అబ్బయ్య చౌదరి తెలిపారు. ఎవరో ప్రచారం చేసినంత మాత్రాన అబ్బయ్య చౌదరి పార్టీ మారరని గుర్తు చేశారు. తాను భయపడి పారిపోతానని భావించడం కూడా అంతేనని, ఎవరూ పార్టీ కార్యకర్తలు ఈ ప్రచారాన్ని నమ్మవద్దంటూ అబ్బయ్య చౌదరి ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
Tags:    

Similar News