YSRCP : వైసీపీలో చేరిన అంబటి రాయుడు
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరా
ambati rayudu has joined ysr congress party
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంబటి రాయుడు వైసీపీలో అధికారికంగా చేరిపోయారు. ఆయనను పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. అంబటి రాయుడు రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
గత కొంతకాలంగా...
అంబటి రాయుడు గత కొంతకాలంగా గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే అధికారికంగా మాత్రం అంబటి రాయుడు పార్టీలో చేరలేదు. అయితే ఈరోజు ఆయన పార్టీలో చేరడంతో ఆయనకు గుంటూరు జిల్లాలో ఒక సీటును జగన్ ఆఫర్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.