Ys Jagan : నేడు కడప జిల్లాకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి తన నివాసం నుంచి బయలుదేరి జగన్ కడపకుచేరుకుంటారు. అక్కడ ఉదయం పదకొండు గంటలకు మేడా రఘునాధరెడ్డి కన్వెన్షన్ లో ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
వివాహ వేడుకకు...
కడప జిల్లాకు జగన్ వస్తుండటంతో పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కడప విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరి కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు. అయితే జగన్ కడప జిల్లా పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తునుు ఏర్పాటు చేశారు.