Ys Jagan : నేడు చిత్తూరు జిల్లాకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యంలో తోతాపురి మామిడి రైతులను జగన్ పరామర్శించనున్నారు. అయితే హెలిప్యాడ్ కు అనుమతించిన పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఎదురయిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హెలిప్యాడ్ వద్దకు జగన్ కు స్వాగతం చెప్పేందుకు కేవలం 30 మందిని మాత్రమే అనుమతించనున్నారు.
ఆంక్షల మధ్య పర్యటన...
అలాగే ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదు. అలాగే బంగారు పాళ్యం మామిడి మార్కెట్ వద్దకు ఐదు వందల మందిని మాత్రమే అనుమిస్తామని చెప్పారు. అంతకు మించి ఎవరైనా వస్తే రౌడీషీట్లు తెరుస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జగన్ పర్యటనకు సంబంధించి 375 మంది వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. రైతులతో మాట్లాడి వెళ్లి పోవాలని, ప్రదర్శన చేయడానికి అనుమతి లేదని చెబుతున్నారు. మరొకవైపు వైసీపీ నేతలు మాత్రం జగన్ వస్తుండటంతో పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.