Ys Jagan : అమరావతికి లక్ష కోట్లు.. మెడికల్ కాలేజీలకు ఐదు కోట్లు వెచ్చించలేరా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి లక్ష కోట్లు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్వహణకు ఐదు వేల కోట్లను ఖర్చు చేయడం లేదని అన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలులో కూడా అనేక లోపాలున్నాయని, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. వచ్చిన ఏడాదిన్నరలోనే లక్షల కోట్లు అప్పులు చేసి అభివృద్ధి లేదని, సంక్షేమం కూడా లేదని జగన్ అన్నారు. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలను కోరారు.
ఏ ఎన్నికలు వచ్చినా పోటీ...
ఏ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినప్పటికీ వైసీపీ పోటీ చేస్తుందని, అందుకు అనుగుణంగా నేతలు ఇప్పటి నుంచే పనిచేయాలని నేతలను ఆదేశించారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల కోసమే విద్యారంగాన్ని పూర్తిగా వదిలేశారని జగన్ చెప్పకొచ్చారు. ప్రభుత్వం చేయ కూడని పనులన్నీ చేస్తుందన్న జగన్ ఐదేళ్లలో వైసీపీ చేసిన అప్పులను ఏడాదిలోనే చేసిందన్నారు. నేతలు తమ నియోజకవర్గాల్ల బూత్ స్థాయి కమిటీను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని, త్వరలోనే తాను జనంలోకి వస్తానని జగన్ చెప్పుకొచ్చారు.