Ys Jagan : నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు బెంగళూరు నుంచి జగన్ బయలుదేరి రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి జగన్ చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ఇంటికి చేరుకోనున్నారు.
రేపు ముఖ్య నేతలతో...
అయితే రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ క్షేత్రస్థాయిలో చేయాలని కూడా జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్నది మన ప్రభుత్వమేనని, అందరూ బయటకు వచ్చి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపు నివ్వనున్నారు.