150 ఏళ్ల తర్వాత తొలిసారి కనిపించిన అడవి దున్న

నల్లమల అటవీ ప్రాంతంలో అడవిదున్న కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

Update: 2024-07-03 02:00 GMT

నల్లమల అటవీ ప్రాంతంలో అనేక అంతరించిపోతున్న జాతులు కనిపిస్తున్నాయి. ఇటీవల రాబందు కనిపించింది. తాజాగా నల్లమల అటవీ ప్రాంతంలో అడవిదున్న కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ అడవి దున్న కనిపించిందని తెలిపారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ అడవి దున్న కనిపించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

1870 తర్వాత...
భారత్ లో పశ్చిమ కనుమల్లో ఎక్కువగా ఈ అడవి దున్నలు సంచరిస్తుంటాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. 1870 తర్వాత ఇది తొలిసారి తమకు కనిపించినట్లు తెలిపారు. గతఏడాది వెలుగోడు రేంజ్ లో తిరుగుతూ తమకు కనిపించిందని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాద తెిపారు. కర్ణాటక నుంచి ఇది నల్లమలలోకి వచ్చినట్లు తాము అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.


Tags:    

Similar News