విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్
విజయవాడ,విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నాయి
metro trains in hyderabad
విజయవాడ,విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. అనేక విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్టారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కే.ఎఫ్.డబ్ల్యూ, ఏ.ఎఫ్.డి. ఎన్.డి.బి, ఏఐఐబీ, ,జైకా,ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరయి చర్చించారు.
మెట్రో రైలు నిర్మాణానికి...
విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్ లను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. రెండు మెట్రో ప్రాజెక్ట్ లకు అయ్యే వ్యయంలో పన్నెండు వేల కోట్ల రూాపయల రుణం అవసరం అవుతుందని అంచనా వేశారు. విశాఖ మెట్రోకు 6100 కోట్లు,విజయవాడ మెట్రోకు 5900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ సంప్రదింపులు జరుపుతుంది. త్వరలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు.