Vijayawada : ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతి

భారీ వర్షాలకు పెరుగుతున్న కృష్ణానది వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది.

Update: 2025-10-30 06:52 GMT

భారీ వర్షాలకు పెరుగుతున్న కృష్ణానది వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. పులిచింతల, ప్రకాశం బ్యారేజి వద్ద దిగువకు వరద నీటిని నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుతానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.

ఐదు లక్షల క్యూసెక్కులు...
వరద ప్రవాహం ఐదు లక్షల క్యూసెక్కులు వరకు చేరే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే వరద ప్రవాహం క్రమంగా వరద తగ్గే అవకాశం ఉందని, లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నదిలో ప్రయాణం, ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ  ప్రఖర్ జైన్ వెల్లడించారు.


Tags:    

Similar News