Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది.

Update: 2025-09-04 02:51 GMT

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అధికంగా నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. దీంతో అనీటిపారుదల శాఖ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టును చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు అక్కడి చేరుకుంటుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జల విద్యుత్తు....
శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,66,112 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 66,334 క్యూసెక్కులుగా ఉంది. అదే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టుకుడి ఎడమల జిల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు చేరడంతో ఎవరూ పాతాళగంగలోకి దిగే ప్రయత్నం చేయవద్దని భక్తులకు సూచించారు.


Tags:    

Similar News