Srisailam : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.

Update: 2025-07-11 04:21 GMT

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. మూడు గేట్ల ద్వారా నీటిని అధికారుల దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,48,696 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,48, 734 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులుగా ఉంది.

విద్యుత్తు ఉత్పత్తి...
కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్నభారీ వర్షాలకు శ్రీశైలం జలాశయంలో వరద నీటి ప్రవాహం రోజురోజుకూపెరుగుతుంది. కిందకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతుంది.


Tags:    

Similar News