శ్రీశైలం జలశయానికి పెరుగుతున్న వరద నీరు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది
శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో మూడు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
పర్యాటకుల సంఖ్య పెరగడంతో...
శ్రీశైలం జలాశయానికి 1,37,635 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అవుట్ ఫ్లో 1,48,535 క్యూసెక్కులగా ఉంది. కుడి, ఎడమ శ్రీశైలం జలాశయాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. అయితే వీకెండ్ కావడంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. వీకెండ్ లో శ్రీశైలంలో స్వామి వారిని దర్శించుకుని భక్తులు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ప్రాజెక్టు వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు దగ్గరుండి వాహనాలను అక్కడ నిలబడకుండా చూస్తున్నారు.