శ్రీవారి ఆలయ సమీపంలో విమానాలు

తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో విమానాల రాకపోకలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి

Update: 2025-03-14 06:26 GMT

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానాల రాకపోకలు ఆగమ శాస్త్రానికి విరుద్ధం. అయితే గత కొన్ని రోజులుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. విమానాలు తరచూ శ్రీవారి ఆలయ సమీపంలో వెళుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అలయ సమీపం నుంచి విమానాలు వెళుతుండటంతో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

ఎన్నిసార్లు...
తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా ఎయిర్ పోర్టు అథారిటీ పట్టించుకోవడం లేదు. ఈ మధ్యనే ఈ విషయంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ కూడా రాశారు. తాజాగా నిన్న ఒక్కరోజే ఉదయం ఎనిమిది విమానాలు తిరుమలలోని ఆలయ సమీపం నుంచి వెళ్లాయి. దాదాపు నలభై ఐదు నిమిషాల వ్యవధిలో ఎనిమిది విమానాలు వెళ్లడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News