అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ వార్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ వార్ కలకలం రేపుతుంది. సినీ హీరోల అభిమానుల మధ్య తలెత్తిన ఫ్లెక్సీ వివాదం ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు రంగంలోకి దిగారు

Update: 2025-09-05 08:01 GMT

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ వార్ కలకలం రేపుతుంది. సినీ హీరోల అభిమానుల మధ్య తలెత్తిన ఫ్లెక్సీ వివాదం ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ అభిమానులు ఇది కల్యాణ్ సీమ అని ఫ్లెక్సీలు వేసి ముద్రించగా, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇది బాబు సీమ అంటూ ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలతో కేవలం అభిమానుల మధ్య రగడ మాత్రమే కాదని పోలీసులు గుర్తించారు.

డీఎస్సీ వార్నింగ్...
ఈ వివాదం కులాల మధ్య చిచ్చు పెట్టే అవకాశముందని భావించి పోలీసులు రంగంలోకి ఫ్లెక్సీలపై అనుచిత కామెంట్స్ పోస్టు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జిల్లాలో ఫ్లెక్సీలు తయారు చేసే సంస్థలతోనూ డీఎస్పీ సమావేశమై ఇటువంటి ఫ్లెక్సీలను ముద్రిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయంగా కూడా ఈవివాదం ముదిరే అవకాశముండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News