ఒంగోలులో కొనసాగుతున్న ఫ్లెక్సీల టెన్షన్.. బాలినేని ఫ్లెక్సీలు చించివేత
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చించివేయడం ఒంగోలులో కలకలం రేపింది.
balineni srinivasulureddy flexi
ఒంగోలులో ఫ్లెక్సీల టెన్షన్ కొనసాగుతుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చించివేయడం కలకలం రేపింది. బాలినేని శ్రీనివాసులురెడ్డి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేపు ఆయన జనసేనలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరనున్నారు.
జనసేనలో చేరిక...
అయితే ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసులురెడ్డి అనుచరులు ఒంగోలులో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చించివేయడంతో ఇది ఎవరి పని అనేది ఆరా తీస్తున్నారు. బాలినేని జనసేనలో చేరడం ఇటు టీడీపీ, అటు జనసేన ఒంగోలు నేతలకు ఇష్టం లేదు. ఇది గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది.