చిత్తూరు జంట హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష

చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఐదుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది

Update: 2025-10-31 05:50 GMT

చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఐదుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది. కొద్దిసేపటి క్రితం చిత్తూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పు చెప్పారు. మరణశిక్ష ను ఐదుగురు నిందితులకు ఖరారు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ హత్య జరగడాన్ని సీరియస్ గా తీసుకున్న న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది. పదేళ్ల క్రితం ఈ హత్య జరిగింది. చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ దంపతులను మున్సిపల్ కార్యాలయంలోనే హత్య చేశారు.

పదేళ్ల క్రితం జరిగిన...
ఈ ఘటనలో మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్ లు మృతి చెందారు. 2015 నవంబరు 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ హత్య జరిగింది. ఈ కేసులో వీరి మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు ఇరవై రెండు మీద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాధ్, వెంకటేశ్ లపై నేరం రుజువు కావడంతో వీరికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.


Tags:    

Similar News