Prakash Raj : మరో ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్... ఈసారి కూడా పవన్ పైనే?
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వదిలిపెట్టడం లేదు. వరస ట్వీట్లతో ఆయన ప్రశ్నలు సంధిస్తున్నారు.
prakash raj
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వదిలిపెట్టడం లేదు. వరస ట్వీట్లతో ఆయన ప్రశ్నలు సంధిస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన రెండు,మూడు రోజుల నుంచి వరస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై మొదలయిన ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. తాను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానని, ఇండియాకు వచ్చిన తర్వాత సమాధానం చెబుతానని ప్రకాశ్ రాజ్ తెలిపారు.
ట్వీట్ లో ఏమున్నదంటే?
ఈరోజు కూడా ప్రకాశ్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ పేరు ఎత్తకపోయినా ఆ ట్వీట్ పవన్ ను ఉద్దేశించి చేసిందేనని అర్థమవుతుంది. ప్రకాశ్ రాజ్ ఈరోజు ట్వీట్ ఏం చేశారంటే? "గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్" అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.