Posani Krishna Murali : పోసాని బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ

సినీ నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్ పిటీషన్ పై నేడు ఆదోని కోర్టులో విచారణ జరగనుంది

Update: 2025-03-10 04:34 GMT

సినీ నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్ పిటీషన్ పై నేడు ఆదోని కోర్టులో విచారణ జరగనుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు,పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోసాని కృష్ణమురళిపై వరస కేసులు నమోదయ్యాయి. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసుల వరకూ నమోదయ్యాయి.

వరస కేసులతో...
అయితే ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా పోసాని కృష్ణమురళి ఉన్నారు. అయితే పోసాని కృష్ణమురళిని తమకు విచారించడం కోసం కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటీషన్ పై విచారణ పూర్తయ్యింది. కస్టడీపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. దీనికి తోడు పోసాని కృష్ణమురళి పై ఇంకా వరస కేసులు నమోదవుతూనే ఉన్నాయి.


Tags:    

Similar News