Posani Krishna Murali : కడప జిల్లా కేంద్ర జైలుకు పోసాని
సినీనటుడు పోసాని కృష్ణమురళిని కడప జిల్లా జైలుకు తరలించనున్నారు.
సినీనటుడు పోసాని కృష్ణమురళిని కడప జిల్లా జైలుకు తరలించనున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు న్యాయస్థానం పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. కులాల మధ్య రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ బుధవారం రాత్రి పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
పథ్నాలుగు రోజులు రిమాండ్...
అయితే నిన్న ఉదయం నుంచి సుదీర్ఘ సమయం విచారించిన అనంతరం రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. మార్చి 12వ తేదీ వరకూ పోసాని రిమాండ్ లో ఉండనున్నారు. గురువారం రాత్రి న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టగా ఉదయం 5.30 గంటల వరకూ ఇరువర్గాలు తమ వాదనలు కొనసాగించాయి.