ఓబులావారిపల్లె పోలీస్ స్టేసన్ లో పోసాని

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఓబులావారి పల్లె పోలీస్ స్టేషన్ కు తరలించారు

Update: 2025-02-27 04:23 GMT

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఓబులావారి పల్లె పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరికాసేపట్లో ఆయనను న్యాయస్థానానికి తరలించనున్నారు. నిన్న రాత్రిహైదరాబాద్ లో ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో అనంతపురం జిల్లాకు తరలించారు. ఆయనపై నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదయ్యాయి.

కాసేపట్లో న్యాయస్థానానికి...
ఓబులాపురం పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపు విచారించిన అనంతరం పోసాని కృష్ణమురళిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బెయిల్ కోసం పోసాని కృష్ణమురళి తరుపున న్యాయవాదులు న్యాయస్థానానికి చేరుకున్నారు. అయితే నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టడంతో ఆయనకు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్నది మరికాసేపట్లో తేలనుంది.


Tags:    

Similar News