Posani Krishna Murali : ఆదోనికి పోసాని కృష్ణమురళి.. యాత్ర సాగుతుందిలా
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జైలు నుంచి ఆదోని కి తరలించారు
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జైలు నుంచి ఆదోని కి తరలించారు. తొలుత రాజంపేట జైలులో ఉంచిన పోలీసులు తర్వాత పీటీ వారెంట్ పై నరసరావుపేట పోలీసులు అక్కడకు తరలించి నరసరావుపేట జైలులో ఉంచారు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు నమోదు కావడంతో వరసగా పోలీసులు పీటీ వారెంట్ తో మరొక ప్రాంతానికి తరలిస్తున్నారు.
వరస కేసులతో...
ఆదోని మూడో పట్టణ పీఎస్ లో పోసాని పై కేసు నమోదు కావడంతో , పోసాని కృష్ణమురళిని తమకు అప్పగించాలని గుంటూరు జిల్లా సిబ్బందిని ఆదోని పోలీసులు కోరారు. దీంతో ఆయనను ఆదోని జైలుకు తరలించారు. ఇంకా పోసానిపై అనేక కేసులు పెండింగ్ లు ఉండటంతో వరస కేసులతో ఆయనను ఏపీ వ్యాప్తంగా పోలీసులు అన్ని జైళ్లను ఆయనకు చూపించే అవకాశాలున్నాయి.