Posani Krishna Murali : హైకోర్టులో పోసానికి భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సినీనటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ లిలీఫ్ లభించింది

Update: 2025-03-06 07:15 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సినీనటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ లిలీఫ్ లభించింది. ఆయనపై ఇప్పటికే నమోదయిన కేసుల్లో విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో నమమోదయిన కేసుల్లో తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పోసాని కృష్ణమురళిపై వరస కేసులు నమోదయ్యాయి. దాదాప పదిహేడు కేసులు ఏపీ వ్యాప్తంగా నమోదయ్యాయి.

కేసులను క్వాష్ చేయాలని...
దీంతో పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ తో జిల్లా జైలుకు మారుస్తున్నారు. దీనిపై పోసాని కృష్ణమురళి తనపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై నేడు విచారించిన హైకోర్టు ఈ రెండు జిల్లాల్లో నమోదయిన కేసుల్లో తదుపరి విచారణ చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


Tags:    

Similar News