పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్

సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్ వేశారు.

Update: 2025-03-05 03:26 GMT

సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై నమోదైన అన్ని కేసులను క్వాష్‌ చేయాలని హై కోర్టులో పిటిషన్ వేసిన పోసాని తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. వరస కేసులు నమోదు చేస్తూ తనకు ఇబ్బంది కలిగిస్తున్నారని, తన ఆరోగ్యం సక్రమంగా లేదని పోసాని కృష్ణ మురళి పిటీషన్ లో పేర్కొన్నారు.

తనపై నమోదయిన కేసులు...
పోసాని కృష్ణ మురళిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో పదిహేడు కేసులు వరకూ నమోదయ్యాయి. వరసగా పీటీ వారెంట్ తో న్యాయస్థానాల్లో హాజరుపరుస్తూ జైలుకు షిఫ్ట్ చేస్తుండటంతో పోసాని కృష్ణ మురళి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.


Tags:    

Similar News