కర్నూలు జిల్లాలో విషజ్వరాలు
కర్నూలు జిల్లాలో విషజ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో విషజ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. అనేక మంది విషజ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎక్కువ మంది విషజ్వరాల బారిన పడి చేరుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టారు. కర్నూలు ఆస్పరి మండలం కల్లపరిలో విషజ్వరాలు ప్రబలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రత్యేక పరీక్షలు నిర్వహించి...
కల్లపరిలో మూడు వందల యాభై మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి పరీక్షలు నిర్వహించడంతో అందులో యాభై మూడు మందికి విషజ్వరాలు సోకినట్లు వైద్య బృందాలు నిర్ధారించాయి. నేడు గ్రామానికి రాష్ట్రస్థాయి వైద్యాధికారులు చేరుకుని పరిస్థితిని అంచనా వేసి తగిన చర్యలు తీసుకోనున్నారు.