అమరావతి టు అరసవిల్లి.. పాదయాత్ర

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల మహాపాదయాత్ర ప్రారంభమయింది.

Update: 2022-09-12 03:12 GMT

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల మహాపాదయాత్ర ప్రారంభమయింది. అమరావతి నుంచి అరవసవిల్లి వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. వెంకటపాలెం నుంచి కృష్ణయ్య పాలెం నుంచి పెనుమాక గ్రామం వరకూ ఈ పాదయాత్ర కొనసాగతుంది. పెనుమాక గ్రామంలో మధ్యాహ్నం భోజన విరామసమయంగా నిర్ణయించారు.

రెండు నెలల పాటు....
అనంతరం తిరిగి బయలుదేరిన పాదాయత్ర పెనుమాక రోడ్డులోని తోట ఎర్రబాలెం నంచి నవులూరు గోలి వారి తోట మీదుగా మంగళగిరి పట్టణంలోని పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాత్రికి గౌతమ బుద్ద రోడ్డులోని రాయల్ కన్వెషన్ హాలులో రైతుల కోసం షెల్టర్ ఏర్పాటు చేశారు. మొత్తం 12 పార్లమెంటు, 45 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ పాదయాత్ర కొనసాగనుంది. మధ్యలో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచం పుణ‌్యక్షేత్రాలను రైతులు దర్శించుంటారు. అరవై రోజులు పాటు ఈ యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను రూపొందించారు.


Tags:    

Similar News