Andhra Pradesh : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. పండగకు ముందే నోరు తీపి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు దీపావళికి తీపి కబురు అందించింది

Update: 2025-10-18 06:37 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు దీపావళికి తీపి కబురు అందించింది. ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవుతాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కోసం ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రకటించిన కీలక వివరాలు రైతులకు తెలియజేసింది. రైతులు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఏపీ సర్కార్ చెప్పింది.

ఈ నెల 27వ తేదీ నుంచి...
ఈ నెల అక్టోబర్ 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకుంటాయని ప్రభుత్వం తెలిపింది. అదే రోజు నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది.
సులువుగా రిజిస్ట్రేషన్...
రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం 10,700 మంది సిబ్బంది ధాన్యం సేకరణ ప్రక్రియలో పాలుపంచుకుంటారకని, సులభమైన రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోళ్లు జరుగుతాయని తెలిపింది. ధాన్యం కొనుగోలు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేశామని చెప్పింది. ఇకపై WhatsApp ద్వారా "Hi" అని పంపి కూడా కొనుగోలు ప్రక్రియను ప్రారంభించవచ్చని పేర్కొంది. గత ప్రభుత్వం పెట్టిన 1,674 కోట్ల బకాయిలను, రైస్ మిల్లర్లకు చెల్లించవలసిన రూ. 763 కోట్లను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చెల్లించింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరి నుంచి ధాన్యం సేకరణ జరుపుతామని చెప్పింది.


Tags:    

Similar News