Annadatha Sukhibhava: అన్నదాతకు సుఖీభవ ఎప్పుడు...? ఖరీఫ్ సీజన్ ప్రారంభమయి ఇన్ని రోజులవుతున్నా?
ఖరీఫ్ సీజన్ ప్రారంభయినా ఇంకా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకపోవడంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు
ఖరీఫ్ సీజన్ ప్రారంభయినా ఇంకా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకపోవడంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయినా తమకు విత్తనాల కొనుగోలుకు, యూరియా, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు అవసరమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకపోవడంపై పెదవి విరుస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్ పథకం నిదులతో కలిపి విడుదల చేయాలని నిర్ణయించడంతో కొంత ఆలస్యమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎవరూఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అన్నదాత సుఖీభవ పథకం అర్హులైన అన్నదాతలందరికీ వర్తిస్తుందని చెబుతున్నారు.
జులై నెల ముగుస్తున్నా...
జులై నెల ముగుస్తున్నా ఇప్పటి వరకూ నిధులు విడుదల చేయకపోవడంతో పాటు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు చెప్పడంతో రైతులు రైతు సేవా కేంద్రాల వద్దకు, బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఒకవైపు ఖరీఫ్ పనులు ప్రారంభం కావడంతో ఇటు రైతు సేవా కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరగలేక పోతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకూ పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు జమ చేస్తారన్న విషయం చెప్పకపోవడంతో ఈ సీజన్ లో తమకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు అందుతాయా? లేదా? అన్న అనుమానం అందరిలోనూ కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ నెలలోనే జమ చేస్తామని చెబుతున్నారు.
అర్హులను గుర్తించే కార్యక్రమం...
గత ఎన్నికల ప్రచారంలో అన్నదాతల సుఖీభవ పథకంకింద ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే పీఎం కిసన్ నిధుల కింద ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేలు జమ కానుండంతో పదహారువేల రూపాయలుఅన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతలుగా ఇస్తామని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేరెండువేలు, రాష్ట్ర ప్రభుత్వం నాలుగువేల రూపాయలు నిధులు ఇచ్చిమొత్తం ఆరువేల రూపాయలు జమచేయాలని భావిస్తుంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన లబ్దిదారులను గుర్తించింది. కౌలు రైతులకుకూడా ఈ పథకంవర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది.మొత్తం మీద నిధుల కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.