కర్నూలు రైతును కోటీశ్వరుడిని చేసిన టమాటా

కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో రైతు సాయిబాబా 40 ఎకరాల్లో టమాటా సాగు చేశారు

Update: 2021-11-25 07:03 GMT

కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో రైతు సాయిబాబా 40 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఎకరానికి రెండు లక్షల రూపాయల ఆదాయం లభించింది. ముగ్గురు అన్నదమ్ములు కలిసి టామాటాను సాగు చేశారు. టమాటా ధర పెరగడంతో దాదాపు కోటి రూపాయలు ఆదాయాన్ని ఈ కుటుంబం గడించింది.

వద్దని చెబుతున్నా....
కర్నూలుకు చెందిన సాయిబాబా నలబై ఎకరాల్లో టమాటా పంట వేశారు. టమాటా వల్ల నష్టం వస్తుందని కొందరు చెప్పినా వినకుండా వినలేదు. ఫలితంగా సాయిబాబా పొలంలో టమాటా విరగ కాసింది. ఇప్పుడు టామాటా కిలో వంద రూపాయలు పలుకుతుండటంతో సాయిబాబా టామాటా కారణంగా కోటీశ్వరుడయ్యారు.


Tags:    

Similar News