ఖరీదైన వజ్రం దొరికింది.. అయితే ఆ రైతు ఏం చేశాడంటే?

కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు పొలంలో విలువైన వజ్రం దొరికినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది

Update: 2024-05-25 08:03 GMT

కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు పొలంలో విలువైన వజ్రం దొరికినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. అకాల వర్షాలకు పొలంలో వజ్రం బయటపడినట్లు చెబుతున్నారు. పొలం పనులు చేస్తుండగా కంటపడిన వజ్రాన్ని రైతుఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలిసి వ్యాపారులు ఆయన ఇంటి కి చేరుకుని తమకు విక్రయించాలని రేటు పెంచారు.

వజ్రాల వ్యాపారికి...
చివరకు ఒక వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని ఐదు లక్షల నగదు, రెండు తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. బహిరంగ మార్కెట్ లో ఆ వజ్రం విలువ 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెబతున్నారు. అయితే దీనిపై అత్యంత గోప్యంగా ఉంచారు. వజ్రాన్ని అమ్ముకున్న రైతు, కొనుగోలు చేసిన వ్యాపారి కూడా గుట్టుగా తతంగాన్ని పూర్తి చేశారని తెలిసింది.


Tags:    

Similar News