నేడు పోలీసుల ఎదుటకు గోరంట్ల మాధవ్
నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరుకానున్నారు
నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరుకానున్నారు. గోరంట్ల మాధవ్ కు ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి నిన్న గోరంట్ల మాధవ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు వ్యక్తిగత పనులున్నందున హాజరు కాలేనని మాధవ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోక్సో కేసులో...
దీంతో నేడు గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత ఏడాది నవంబర్ 2న గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు అయింది. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో బాధితురాలి వివరాలు ప్రకటించారని కేసు నమోదు కావడంతో ఆయనను నేడు పోలీసులు విచారించనున్నారు.