వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు వచ్చిన జగన్ ను నరేష్ కుమార్ రెడ్డి కలుసుకున్నారు. ఆయనను పార్టీలోకి కండువా కప్పి జగన్ సాదరంగా ఆహ్వానించారు.
సంక్షేమ పథకాలను చూసి...
నరేష్ కుమార్ రెడ్డి రాకతో ఈ ప్రాంతంలో వైసీపీ మరింత బలపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితుడనై తాను పార్టీలో చేరానని నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.