జగన్ కు కేవీపీ ఘాటు లేఖ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు

Update: 2022-09-27 12:22 GMT

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి చేయాలని ఆయన లేఖలో కోరారు. పోలవరం నిర్మాణానిికి ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరిచండంతో పాటుగా పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను కేంద్రం చేపట్టేలా చూడాలని కోరారు.

రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత....
ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను రాష్ట్రాలకు వదిలేసి కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని కేవీపీ రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత పోలవరం అధారిటీదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర తీరు వల్లనే రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నానని ఆయన అన్నారు. పోలవరం కరకట్ట నిర్మాణానికి ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని కేవీపీ లేఖలో జగన్ కు తెలిపారు.


Tags:    

Similar News